జనాభా నియంత్రణ అందరి బాధ్యత

నిజామాబాద్‌, జూలై 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిజామాబాద్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్‌ మీదుగాటీఎన్జీవో సుభవన్‌ వరకు కొనసాగింది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దండు నీతూ కిరణ్‌ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణను కులమతాలకతీతంగా పాటించాలని, ప్రతి పౌరుడు సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాలని, కుటుంబ నియంత్రణ పాటించనట్లయితే ఉన్న వనరులన్నీ త్వరగా కోల్పోవడం జరుగుతుందని మరియు వాతావరణ కాలుష్యం ప్రకృతి ధ్వంసం కావడం జరుగుతుందని అందుకని ప్రతి ఆశా కార్యకర్త, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి కుటుంబ నియంత్రణ యొక్క ఆవశ్యకతను చాటి చెప్పి అందరూ కుటుంబ నియంత్రణ పాటించేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు.

మరో అతిధి జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణకై ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలని జిజిహెచ్‌లో తమ వంతుగా త్వరలోనే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల శిబిరాలను ఏర్పాటు చేసి జనాభా నియంత్రణకై కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఐఎంఏ జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ జనాభా విస్ఫోటనం అనేది అనుబాంబు కంటే అత్యంత ప్రమాదకరమైనదని అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవితాన్ని అనుభవించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించి జనాభా విస్ఫోటనాన్ని తగ్గించాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం మాట్లాడుతూ జిల్లాలో గత 15 రోజుల నుండి పక్షోత్సవాలని నిర్వహిస్తూ వచ్చే పదిహేను రోజులు జనాభా స్థిరీకరణ పక్షోత్సవాల్లో భాగంగా అనేక కుటుంబాన వ్యాసప్తమి చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులతో పాటు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన ఐయుడి, ఓరల్‌ పిల్స్‌, నిరోద్‌, అంతరా ఇంజక్షన్‌ మొదలగు వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించి అర్హులైన దంపతులందరినీ పాటించేలా ప్రతి ఒక్కరూ ఆశా కార్యకర్త, వైద్య సిబ్బంది కృషి చేయాలని తద్వారా జనాభాను నియంత్రించాలన్నారు.

అదేవిధంగా ఒక అమ్మాయి లేదా అబ్బాయి ద్వారా కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతి అవలంబించిన వారికి, ఐదు సంవత్సరాలు నుంచి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పిపిఐయుసిడి ఉపయోగిస్తున్న వారికి మరియు గత సంవత్సరం నుండి మూడు నెలలకు ఒకసారి తాత్కాలిక కుటుంబ నియంత్రణ ఇంజక్షన్‌ అయిన అంతర తీసుకుంటున్న వారికి వెయ్యి రూపాయలు చొప్పున ఇన్సెంటివ్‌ లక్కీ డీప్‌ ద్వారా అందజేశారు.

జిల్లాలో గత సంవత్సరం నుండి కుటుంబ నియంత్రణ మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు మరియు అన్ని జాతీ ఆరోగ్య కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రం, మెమొంటో ద్వారా సత్కరించారు. కార్యక్రమంలో, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌, ఐఎంఎస్‌ సెక్రటరీ డాక్టర్‌ జలగం తిరుపతిరావు, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్‌ బి, పిఓడిటి డాక్టర్‌ నాగరాజు, జిల్లా ఉపవైద్యాధికారులు బోధన్‌ డాక్టర్‌ విద్య, నిజామాబాద్‌ డివిజన్‌ నుండి డాక్టర్‌ సరిత, జిల్లా ఆరోగ్య సమాచార ప్రచార అధికారి, ఏవో బి. గంగాధర్‌, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్‌ వెంకటేశ్వర్లు, డిపిఓ విశాల, రాజేందర్‌ మురళి, వినీత్‌, మధుకర్‌, స్వామి సులోచన, రమ వివిధ పిఎస్‌ఎల్‌ నుండి విచ్చేసిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »