కామారెడ్డి, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మెడికల్ కళాశాల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాల నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు.
పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.