కామారెడ్డి, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ది రాములు, గత కొన్ని రోజుల క్రితం గల్ఫ్ దేశంలో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
ఆయన వెంట రామారెడ్డి జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ సర్పంచ్ గీ రెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.