కామారెడ్డి, జూలై 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీల్లో జరుగుతోందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా బుధవారం కామారెడ్డి కలెక్టర్ నుంచి టీఎస్పీఎస్ అధికారులతో మాట్లాడారు.
జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 వేల 881 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు.