డిచ్‌పల్లి, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల డిగ్రీ బిఏ, బీకాం, బిఎస్సి,బి బి ఏ, కోర్సులకు చెందిన 2వ 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల తేదీలను మార్పు చేస్తూ ప్రొఫెసర్ అరుణ రిషెడ్యూల్ విడుదల చేశారు.
డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు గ్రూప్-1, గ్రూప్ ‘ఏ’ కి సంబంధించిన కళాశాలల్లో జులై 19 తేది నుంచి 24వ తేది వరకు జరుగుతాయని, గ్రూప్ ‘బి’ కి చెందిన కళాశాలల్లో జులై 27 తేది నుంచి ఆగస్టు 2వ తేది వరకు, అదే విదంగా స్టాటస్టిక్స్ ప్రాక్టికల్ / ప్రాజెక్టు ఎగ్జామినేషన్ పరీక్ష సెట్-2,లో గ్రూప్ ‘ఏ’ కి చెందిన కళాశాలల్లో జులై 25, 26వ తేదీల్లో జరుగుతుందని, గ్రూప్ ‘బి’ కి చెందిన కళాశాలల్లో ఆగస్టు 3, 4వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సంప్రదించాలని సూచించారు.