బాన్సువాడ, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని హన్మజిపేట్ గ్రామంలో పశు వైద్య కేంద్రంలో గురువారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రామిరెడ్డి పశుగ్రాస వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాడిపశు సంపదకోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పాడిపశు రైతులు పశుసంపదను పెంపొందించే విధంగా చూసుకోవాలన్నారు.
అనంతరం డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పశుగ్రాసానికి జొన్న గడ్డి , జనుమ,సిల్లీ పెసర ,స్వీట్ పొటాటో, స్టైల్లో ఎమ్మాట మొదలగు పశుగ్రాసాల సాగు విధానం ద్వారా పాడి పశువులలో అధిక పాల దిగుబడి సాధించవచ్చు అని ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించారు. పాడి పశువులకు మంచి పశుగ్రాసాన్ని అందించినట్లయితే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు.
ఈ సందర్భంగా పశు వైద్య శిబిరంలో 245 గేదెలకు గొంతు వాపు రాకుండా టీకాలు, గొర్రెలకు చిటుకు వ్యాధి రాకుండా 646 జీవాలకు ఈటి టీకాలు, దూడలకు నట్టల నివారణ టీకాలువేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్, పశు వైద్యాధికారి రోహిత్ రెడ్డి, డాక్టర్ జయపాల్ సింగ్, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, ఖాదర్, తుకారం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.