బాన్సువాడ, జూలై 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ని, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షహీద్ను కోటగిరి మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని మేనిఫెస్టోలో రెండు లక్షల రునమాఫి, నిరుద్యోగ భృతి 4000, ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ 5 లక్షలు, పింఛను 4000, సిలెండర్ 500 లకే, మహిళలకు బస్లో ఉచిత ప్రయాణం, చదువుకునే యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీనీ ఉచితంగ ఇవ్వడం జరుగుతుందని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా మైనారిటీ కార్యదర్శి వహీద్, గ్రామ మైనారిటీ అధ్యక్షుడు అయ్యూబ్, నాయుడు వేణు, మండల కిసాన్ ఖెత్ అధ్యక్షుడు ఆనంద్, వార్డ్ మెంబర్ పతా, నసీం, తులసిరాం, చంద దత్తు, భూంరెడ్డి, అయ్యుబ్, అన్వర్, ప్రశాంత్, లక్ష్మయ్య తదితరులున్నారు.