కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలలో రక్తహీనత లేకుండా అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం రక్తహీనత, బాల్య వివాహాల నిర్మూలన పై యునెస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, బాలికలు రక్తహీనతకు లోను కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఐకెపి అధికారులు, ఉపాధ్యాయులు తెలియజేయాలని చెప్పారు. రక్తహీనత కలిగిన బాలికలు చదువుపై ఏకాగ్రత ఉండదని తెలిపారు.
పాఠశాలకు వరుసగా గైరాజర్ అవుతారని చెప్పారు. రోగనిరోధక శక్తి తగ్గి అధికంగా ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లక్షణాలున్న బాలికలను గుర్తించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో బాల్యవివాహాలు నిర్మూలించాలని చెప్పారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే కలిగే నష్టాలను వారి తల్లిదండ్రులకు వివరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సిడబ్ల్యూసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, యూనేసెఫ్ అధికారులు సుబ్బారెడ్డి, కృష్ణ, ఇంచార్జ్ ఐసిడిఎస్ పిడి రమ్య, డిపిఎం రమేష్ బాబు, ఐకెపి అధికారులు పాల్గొన్నారు.