కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణి (18) మరియు బాలమణి (55) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన మూడు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని, స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 కి సంప్రదించాలన్నారు.