కామారెడ్డి, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండాకాలం మండుటెండలు ముగిసి వర్షాకాలపు చిరుజల్లులు మొదలయ్యే కార్తిలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ప్రకృతిలో అనేక మార్పులు రావడం జరుగుతుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీర ధర్మాన్ని మార్చుకొని ఆ మార్పును స్వాగతించే లక్షణాన్ని అలవర్చుకోవడంలో భాగంగా మనకు విభిన్న సంస్కృతులను రకరకాల పండుగలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇందులో భాగంగా ఆషాడమాసంలో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యాన్ని మరియు పరస్పర స్నేహభావాన్ని సమన్వయం యొక్క ఆవశ్యకతను తెలియజేసి అందరిలో ఐక్యత భావాన్ని సమభావాలను రూపొందించాలని ఉద్దేశంతో గోరింటాకు మన తెలంగాణలో మైదాకు అనే పేరుతో చేతులకు అలంకరించుకునే సాంప్రదాయం ఎన్నో ఏళ్లుగా వస్తున్నది.
పూర్వపు సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించాలని సదువు దేశంలో మరియు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పిల్లలకు అందించాలని భావనతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫ్యాషన్ పల్లి నందు మైదాకు పండగ గోరింటాకు ఉత్సవాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో పాఠశాలలోని విద్యార్థులందరూ జట్లుగా ఏర్పడి ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ గోరింటాకును వారి చేతులకు అలంకరించుకొని చివరకు పెద్ద పిల్లలు అలంకరించుకోవడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాన్ని పరస్పర సమన్వయ లక్షణాలను పెంపొందించే ప్రయత్నం చేశారు. విద్యార్థినిలు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమంలో ఆనందం పొందారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తాడ్వాయి శ్రీనివాస్, నరసింహారావు, సంతోష్ కుమార్, అఖిల్ హుస్సేన్, సురేందర్, ప్రకాశం, మహేష్, అర్జున్ తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.