బాన్సువాడ, జూలై 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిఅన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి మాత శిశు ఆసుపత్రికి అనుసంధానంగా మూడు కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఒకటిన్నర కోట్లతో ఏర్పాటు చేసిన 10 బెడ్స్ డయాసిస్ యూనిట్, 27 లక్షలతో ఏర్పాటు చేసిన స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్, 5 లక్షలతో నిర్మించిన రోగి సహాయకుల షెడ్డును సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదు డయాలసిస్ బెడ్స్ ఉండగా కొత్తగా మరో ఐదు యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని దీంతో మొత్తం కోటిన్నర రూపాయలతో 10 డయాలసిస్ యూనిట్ బెడ్స్ ఏర్పాటు చేయడంతో డయాలసిస్ రోగులకు వైద్యం అందుతుందన్నారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో నెలకు 400 ప్రసవాలు జరుగుతున్నాయని, మాత శిశు ఆసుపత్రి వైద్యుల కృషి ఎంతో ఉందని తల్లిపాల ప్రోత్సవంలో బాన్సువాడ ఆసుపత్రికి జాతియ అవార్డు లభించడంతో ఈ అవార్డు పొందిన ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి మన మాతా శిశు ఆసుపత్రి అని ఆయన అన్నారు.
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడి కేంద్రాలు పెడుతూ అదేవిధంగా న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరుగుతుందని గర్భిణీ మహిళలు బలంగా ఆరోగ్యంగా ఉంటే పుట్టే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని పైసా ఖర్చు లేకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అను నిత్యం కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో మొత్తం 14 టీఫా మెషిన్లు ఏర్పాటు చేయగా బాన్సువాడ లోఒకటి ఏర్పాటు చేయడంతో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి టిఫా మిషన్ ఉపయోగపడుతుందన్నారు.
నేను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు1997లో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం పాతది కావడంతో నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేయడంతో 37:30 కోట్ల నూతన భవన నిర్మించడానికి అనుమతులు త్వరలో మంజూరు అవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం హరీష్ రావు ప్రోత్సాహంతో నియోజకవర్గంలో వైద్య సేవలు ప్రజలకు చేరువగా తీసుకువస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి,జడ్పిటిసి పద్మ గోపాల్ రెడ్డి, ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్,సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుల్లెట్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు ఎజాస్, దాసరి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, బాడీ శ్రీనివాస్, రమాదేవి రాజా గౌడ్, నార్ల నందకిషోర్ గుప్తా, అమీర్ చావుస్, కిరణ్, విట్టల్ రెడ్డి, నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.