బాన్సువాడ, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలనీ ఎంపీపీ దొడ్లా నీరజ వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోర్లం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాల్లో తప్పనిసరి 6 మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని కావున ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరళ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి శ్రావణి దేవేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, నాయకులు మన్నే చిన్న సాయిలు, జలీల్, నాగభూషణం, జీవన్, శేఖర్, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, అశోక్, అంగన్వాడి టీచర్లు విజయ, పద్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.