ఆర్మూర్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉచిత డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న టెలికాం డైరెక్టర్ షాహిద్, జిల్లా యువజన నాయకులు మీర శ్రావణ్ పట్టణ అధ్యక్షులు గుంజల పృథ్విరాజ్, మాట్లాడుతు ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తారని, అందుకు నిదర్శనం తాజాగా ఆర్మూర్ నియోజకవర్గంలో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యగల వయస్సు వారికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ప్రవేశపెట్టడమే అన్నారు.
గత రెండు రోజుల నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారని, దరఖాస్తు కోసం వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం ఒక వరంలా మారి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆకలి తీరుస్తుందన్నారు.
నేటి పరిస్థితులలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎన్నిసార్లు ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగిన కానీ పనిని ప్రజల అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే ఉచితంగా అందించడమే కాకుండా సులభతరం చేయడం పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారు కింది నెంబర్లకు సంప్రదించాలన్నారు.
- శ్రీకాంత్ 9010771277 (ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది )
- సుమంత్ 9502317803
- సదానంద్ 9440095195
- అరుణ్ 9014079143
- కల శేఖర్ 93810 41416
- రాము 87906 21081
- నబి (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) 8121672010.
అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.