కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో 10 వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు పిల్లి యాదగిరి, గ్రామపంచాయతీ కార్మికుడు నాగభూషణం మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో తాము కూడా పనిచేశామని, గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భిక్కనూర్ మండల అధ్యక్షులు శ్యామ్, వెంకటేష్, స్వామి, శ్రీకాంత్, లక్ష్మణ్ బిక్కనూరు మండల కేంద్రంలోని 18 గ్రామ పంచాయతీల కార్మికులు, కారోబార్లు పాల్గొన్నారు.