కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ర్యాగింగ్ నిషేధ చట్టంపై అవగాహన నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్‌పై శిక్షల గురించి ర్యాగింగ్ నిర్మూలన గురించి విద్యార్థులకు వివరించారు.
జూనియర్ సివిల్ జడ్జి తిరుచిరాపల్లి ఎస్‌పి భార్గవి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ చీఫ్ ఆర్.బి. రమేష్ చంద్, డిప్యూటీ కె. మోహన్ రావు, పి.చిరంజీవి, ఏజిపి లతా రెడ్డి, అడ్వకేట్ షబానా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సీనియర్ అసిస్టెంట్ భరత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ జె. సాయి ప్రణీత్, డేటాఎంట్రీ ఆపరేటర్ కే సాయికృష్ణ, సుబార్డినెట్ నరసింహచారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.