ఆర్మూర్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అనాధలకు, నిస్సహాయులకు తనవంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుండే సేవ్‌లైఫ్ ఫౌండేషన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది.
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు ప్రభాస్ అధ్యక్షతన జండాగల్లి ప్రాంతానికి చెందిన దేశాయిపేట్ మాణిక్ రావు, రూప దంపతుల కుమారుడు దత్త సాయి (18) అనారోగ్య సమస్యతో గతకొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. విషయం తెలుసుకొని ఫౌండేషన్ సభ్యుడు ప్రభాస్ బాలునికి మూడువేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, మూడు నెలలకు సరిపడా మందులను ఉచితంగా అందించి కుటుంబానికి బాసటగా నిలిచారు.
కుటుంబానికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కొట్టాల మోహన్, మార్కెట్ కమిటీ తాజా మాజీ డైరెక్టర్ ఆర్మూరు ప్రశాంత్, అజయ్, ధర్మేందర్, విశాల్, సేవ్‌లైఫ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.