ఎల్లారెడ్డి, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఎల్లారెడ్డి మండల సాతెళ్లి గ్రామ సర్పంచ్ నీరుడి సంగమేశ్, వార్డు సభ్యుడు బెగరి సాయిలు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ కే.సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి మునిసిపల్ కౌన్సిలర్స్, ఎల్లారెడ్డి పి. ఎ.సి.ఎస్ చైర్మన్ నర్సింలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.