కంటి ఆపరేషన్‌ నిమిత్తం సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహాయం

ఆర్మూర్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఎటువంటి సహాయానికైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ తాజాగా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన గుజుల సుధా అనే మహిళకు కంటి ఆపరేషన్‌ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకొని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రభాస్‌ ఆమె కంటి ఆపరేషన్‌కి అవసరమైన డబ్బులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

దీంతో గుజుల సుధా రోటరీక్లబ్‌ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించుకోగా ఆపరేషన్‌కి అవసరమైన పదివేల రూపాయల ఆర్థిక సహాయం సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు ప్రభాస్‌ బాధిత కుటుంబానికి అందజేశారు. తనకు ఆర్థిక సహాయం చేసిన సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ వారికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు ధర్మేందర్‌, ఉదయ్‌, విశాల్‌, వినీత్‌, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »