పార్క్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం

బాన్సువాడ, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని వద్ద నూతనంగా నిర్మిస్తున్న పార్కు నిర్మాణ పనులను సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్కి చెరువు వద్ద నాలుగు కోట్ల రూపాయలతో మల్టీజోన్‌ పార్క్‌ ఏర్పాటు మంత్రి కేటీఆర్‌ సహకారంతో పనులు జరుగుతున్నాయని ఇందులో మహిళలు వృద్ధులు పిల్లల పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్‌ చేయడానికి యోగా ధ్యానం చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ రెస్టారెంట్‌, పార్కింగ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పట్టణ జనాభా పెరగడంతో పార్కుల ఏర్పాటుతో పట్టణ ప్రజలకు ఆరాధకరమైన వాతావరణం అందుబాటులోకి తీసుకువస్తున్నామని పార్క్‌ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన అన్నారు.

కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింలు మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, కౌన్సిలర్లు బాడి శ్రీనివాస్‌, అమిర్‌ ఛావుస్‌, హన్మజీపేట్‌ ఎంపీటీసీ సుధాకర్‌ రెడ్డి, నాయకులు ఏజాస్‌, నరసన్న చారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »