ఆర్మూర్, జూలై 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తామని బిఆర్‌ఎస్ నాయకులు టెలికాం డైరెక్టర్ మీసేవ షహెద్, జన్నెపల్లి రంజిత్, మీరా శ్రవణ్, పృథ్వీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీవన్‌రెడ్డిపై గెలుస్తాడు అనడన్ని వారు తీవ్రంగా ఖండిరచారు.
రేవంత్‌రెడ్డి నీకు దమ్ముంటే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై పోటీచెయ్ చిత్తు చిత్తుగా ఓడిస్తామని వారు హెచ్చరించారు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కలేదని వారు గుర్తు చేసారు. ఆర్మూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఏమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఓడిరచడం ఎవరి తరం కాదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటీలో ఓ జీవన్ రెడ్డి ఉన్నాడని వారు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యాభై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని శపదం చేసారు. సమావేశంలో వెంకట్, రఘు, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.