నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 – 220183 కు ఫోన్ చేసి సమాచారం …
Read More »Daily Archives: July 19, 2023
మూతపడ్డ మరుగుదొడ్లు
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ కొత్త బస్టాండ్లో పేరుకు మాత్రమే ఉచిత మరుగుదొడ్లు. కామారెడ్డి కొత్త బస్టాండ్ మూడు జిల్లాల ప్రజలు కామారెడ్డి నుండి రాకపోకలు జరుగుతాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సులో వెళుతుంటారు. కామారెడ్డి బస్టాండ్ ఆర్టీసీకి సంబంధించిన ఉచిత మరుగుదొడ్లు సరిగా పని చేయకపోవడంతో వాటికి తాళం వేశారు. సంబంధిత ఆర్టీసీ అధికారులను అడగగా మేము …
Read More »అతిధి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు అతిథి ఆధ్యాపకులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రఘురాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 58 పోస్టులలో అతిథి ఆధ్యాపకుల నియమాకానికి ఈ నెల 24వ తేదీ …
Read More »20న లక్కీ డ్రా
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డు కులాలకు చెందిన బిఏఎస్ స్కీమ్ నందు 2023-24 విద్యా సంవత్సరమునకై 1వ తరగతి మరియు 5వ తరగతిలో ప్రవేశము కొరకు స్వీకరించిన దరఖాస్తుల లక్కీ డ్రా ఈనెల 20న ఉదయం 10.30 కి 1వ తరగతి, 12.00 కు 5వ తరగతి ఐడిఓసి, ప్రజావాణి సమావేశపు హాల్‌లో ఉంటుందని జిల్లా షెడ్యూల్ కులాల అభవృద్ధి ఆదికారి శశికళ …
Read More »మలేషియా వేదికగా వలస కార్మికుల సామాజిక రక్షణపై చర్చ
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై ఈనెల 24, 25 రెండు రోజులపాటు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగే బహుళ దేశాల ప్రాంతీయ సమావేశానికి గల్ఫ్ వలసల నిపుణుడు మంద భీంరెడ్డికి ఆహ్వానం అందింది. ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ, మలేషియా కేంద్రంగా పనిచేసే అవర్ జర్నీ అనే సంస్థ …
Read More »అక్కాచెల్లెళ్లను కొట్టి చంపిన దుండగులు
ఆర్మూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అక్క చెల్లెల మర్డర్ కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆర్మూర్‌లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వీరు మగ్గిడి గంగవ్వ (69), మగ్గిడి రాజవ్వ ( 72) గా గుర్తించారు చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన …
Read More »పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల తుది …
Read More »బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన మొపాల జితేందర్ రెడ్డి..
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగర్ అధ్యక్షుడిగా బోధన్ నియోజక వర్గం అబ్జర్వర్‌గా పనిచేసిన సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోపాల జితేందర్ రెడ్డి బుధవారం బీఎస్పీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ …
Read More »ఎన్నికల జాబితాలో తప్పుడు లేకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన భాద్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26,27, సెప్టెంబర్ 2,3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ …
Read More »బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) పి.యాదిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్‌కు చేరుకుని ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌కు స్వాగతంపలికి, పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన …
Read More »