నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులలో ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు అతిథి ఆధ్యాపకులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రఘురాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 58 పోస్టులలో అతిథి ఆధ్యాపకుల నియమాకానికి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఆయా సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కనీసం 50 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని తెలియజేశారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జువాలజీ, సివిక్స్, హిస్టరీ సబ్జెక్టులలో అలాగే ఉర్దూ మీడియంలో బోధించేందుకు ఇంగ్లీష్ ,ఉర్దూ లాంగ్వేజ్, ఫిజిక్స్, బాటని, జువాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
అలాగే నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ, గణిత శాస్త్రము, పౌరశాస్త్రము, ఉర్దూ మీడియంలో ఫిజిక్స్ జువాలజీ మరియు ఒకేషనల్ అకౌంట్స్ అండ్ టాక్సిషన్ గ్రూపులలో అతిధి ఆద్యాపకులను నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. అలాగే భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, మ్యాథ్స్ బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవాలజీ అలాగే ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, కామర్స్ హిస్టరీ, సివిక్స్, హిందీ, ఉర్దూ మీడియం లో ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యార్థి అధికారి తెలిపారు.
అలాగే ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ, ఎకనామిక్స్ , సివిక్స్ కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం లో సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు హిందీ, ఆర్మూర్ బాలుర జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీ, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ, వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జువాలజీ, ఎకనామిక్స్ బోధన్ మధుమలాంచ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులలో అతిధి అధ్యాపకుల నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
అలాగే మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ , ఒకేషనల్ కంప్యూటర్ సైన్స్, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ, ఎకనామిక్స్ , హిస్టరీ/సివిక్స్, ఉర్దూ మీడియం లో మ్యాథ్స్, కామర్స్, ఉర్దూ లాంగ్వేజ్ సబ్జెక్టులలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు . ఈనెల 26వ తేదీన దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని , 27వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని, 28వ తేదీన ఎంపికైన అభ్యర్థులకు కళాశాలల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
ఒక పీరియడుకు 390 రూపాయలు చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్లు తో 28,080 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలిపారు. దరఖాస్తులను జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అందజేయాల్సి ఉంటుందని వివరించారు.