నిజామాబాద్, జూలై 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగర్ అధ్యక్షుడిగా బోధన్ నియోజక వర్గం అబ్జర్వర్‌గా పనిచేసిన సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోపాల జితేందర్ రెడ్డి బుధవారం బీఎస్పీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ పార్టీలో చేరారు.
బీఎస్పీ పార్టీ ప్రజల కోసం పాటుపడుతున్న తీరును చూసి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ని ఆదర్శంగా తీసుకొని బీఎస్పీలో చేరుతున్నట్టు తెలిపారు. నిజామాబాద్ అర్బన్‌లో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మొపాల జితేందర్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల పక్షంగా ఉన్న అన్నీ వర్గాల నాయకులు బిఎస్‌పిలో చేరటంతో పార్టీ బలోపేతం అయ్యి అధికారం దిశగా సాగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ అందరి పార్టీ అని బీఎస్పీ అన్నీ వర్గాల ప్రజల కోసం పని చేస్తుందని పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.