కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటింగ్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఈ.వి.ఎం., వివి ప్యాడ్ ల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ యంత్రాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటింగ్ యంత్రాలపై చైతన్యం పొందాలని సూచించారు.