నిజామాబాద్, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మొక్కలు నాటారు. కార్యాలయం ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం నిర్వహిస్తోందన్నారు.
ప్రభుత్వ శాఖలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణీత గడువులోపు మొక్కలు నాటేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తున్నందున విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.