కామారెడ్డి, జూలై 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం క్రింది 1వ, 5వ తరగతిలో ప్రవేశాలకై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు.
1వ తరగతిలో 64 సీట్లకు, 70 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా లక్కీ డ్రా ద్వారా 64 మందిని ఎంపిక చేశారు. 5వ తరగతిలో 72 సీట్లకు, 84 దరఖాస్తులు రాగా పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డ్రా తీసి 72 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. 36 మంది డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో 15 మందికి తక్షణ ప్రవేశాలు కల్పించారు. కార్యకమంలో ఎస్సి అభివృద్ధి అధికారి వెంకటేష్, పర్యవేక్షకులు కవిత, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.