బాన్సువాడ, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందుర్ గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని నెట్, స్లేట్, సెట్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఆంగ్లంలో రెండు, తెలుగులో రెండు, ఉర్దూ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి, పొలిటికల్ సైన్స్ ఒకటి, గణితం ఒకటి, కంప్యూటర్ సైన్స్ రెండు క్రాప్ ప్రొడక్షన్ ఒకటి ఇంకను ఉర్దూ మీడియంలో హిస్టరీ ఒకటి, ఎకనామిక్స్ ఉర్దూ ఒకటి, పొలిటికల్ సైన్స్ ఉర్దూ ఒకటి, ఉర్దూ కెమిస్ట్రీ ఒకటి, బాటని ఉర్దూ ఒకటి, జువాలజీ ఉర్దూ ఒకటి మొత్తం 17 ఖాళీలు ఉన్నాయన్నారు.
దరఖాస్తు చేసుకునేవారు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో శుక్రవారం 28.7.2023 సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆగస్టు 1వ తేదీ మంగళవారం జిల్లా కేంద్రం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌఖిక పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ గంగాధర్ తెలిపారు.