కామారెడ్డి, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని తెలిపారు. నోటు పుస్తకాలను విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే. గంగా కిషన్ , పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.