రెంజల్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాగులపల్లి గోపికృష్ణను నియమించినట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గోపికృష్ణ పార్టీ కార్యక్రమాలలో క్రియశీలంగా పనిచేస్తూ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినందుకు గుర్తిస్తూ పార్టీ మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు.
తనపై నమ్మకంతో పార్టీ మండల అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించినందుకు మండల శాఖకు, జిల్లా అధ్యక్షుడికి, ఎంపీ అర్వింద్ కు నూతన మండల అధ్యక్షుడు గోపికృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకోసం నిరంతరం పనిచేస్తూ కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మండల అధ్యక్షుడు నియమానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.