మున్నూరు కాపు సంఘం యువజన అధ్యక్షుడిగా కుంట సంజీవ్‌ పటేల్‌

నిజామాబాద్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కొండ దేవయ్య పటేల్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్‌ పటేల్‌ ప్రతిపాదనతో కుంట సంజీవ్‌ పటేల్‌ని నిజామాబాద్‌ జిల్లా మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ, నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో గ్రామ మరియు మండల మరియు జిల్లా స్థాయిలలో జిల్లా కమిటీలను వేయాలని సూచించారు. మున్నూరు కాపు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రతి గ్రామంలో కమిటీలు వేసి మున్నూరు కాపు ఐక్యతను చాటి చెప్పాలని వారు అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »