నిజామాబాద్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కే.రాజేంద్రకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓ కు స్వాగతం పలికారు.
నిజామాబాద్ ఆర్డీఓగా కొనసాగిన రవికుమార్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన కే. రాజేంద్రకుమార్‌ను నిజామాబాద్ ఆర్డీఓగా ఇటీవలే ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆర్డీఓ రాజేంద్రకుమార్ సోమవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.