నిజామాబాద్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 139 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఏఏ శాఖల్లో ఎన్ని దరఖాస్తులు పెండిరగ్ ఉన్నాయనే వివరాలను అదనపు కలెక్టర్ యాదిరెడ్డి వెల్లడిస్తూ, వారం లోపు వాటన్నింటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్ లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు.