ఆర్మూర్, జూలై 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌కె సమాజ్ ఆర్మూర్ వారి అధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాంతీయ సమాజ్ అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్, మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితపవన్ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్ ఆర్మూర్ సమాజం విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు పై చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉంటారని తెలిపారు.
క్షత్రియ విద్యార్థులు మన భారత దేశం గర్వించే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినిత పవన్ మాట్లాడుతూ ఆర్మూర్ సమాజానికి అభినందిస్తూ మన సమాజంలోని పిల్లలు అన్ని రంగాల్లో ఉన్నారని తెలుపుతు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూర్ సమాజం మన డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో దిన దిన అభివృద్ధి చెందడం జరుగుతుందని, అందులో భాగంగా సహస్రార్జున మందిరానికి, లక్ష్మీనారాయణ మందిరానికి పెర్కిట్, మామిడిపల్లి సమాజములకు నిధులను మంజూరు చేశారన్నారు.
అంతేకాకుండా హైదరాబాద్‌లోని ఉప్పల్ బాగాయత్‌లో అత్యంత ఖరీదైన 30 గుంటల భూమిని దాదాపు 30 కోట్ల విలువైన భూమిని మన సమాజానికి ఇప్పించిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఎస్‌ఎస్‌కె సమాజ్ అధ్యక్షుడు హజరి అంతజి మదన్ మోహన్, కార్యదర్శి బారాడ్ గంగమోహన్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏబిఎస్‌ఎస్‌కె ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ బాల్ కిషన్, టాంక్ విష్ణు, అల్జాపుర్ శ్రీనివాస్, వైద్య దినేష్, పూజారి రాజేశ్వేర్, కందేష్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, రెడ్డి ప్రకాష్, జేస్సు ఆనంద్, పట్టణ కౌన్సిలర్స్ కందేశ్ సంగీత, అల్జపూర్ రేవతి, బాదం రాజ్‌కుమార్, జనార్దన్ రాజు, బారడ్ రమేష్, గటడి కిషన్ డీకే శ్రీనివాస్, వైద్య సంజయ్, గటడి రాజేష్, బాదం రాజేందర్, షికారి శ్రీనివాస్ బారడ్ కిషోర్, కార్యవర్గ సభ్యులు యువజన సమాజ్ అధ్యక్షుడు జి.వి. ప్రశాంత్, కార్యదర్శి శ్రీను రాజేష్, యువజన కార్యవర్గసభ్యులు సమాజ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.