ఆర్మూర్, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ యూనిట్ అధికారి సాయి మంగళవారం గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున పరిసరాలు నీటితో నిండి ఉంటాయి కావున వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉండడం వలన డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని ఇంటి యజమానులకు తెలియజేయాలని సూచించారు.
కార్యక్రమంలో వైద్యాధికారులు మానస, ఉమేరా యాస్మిన్, హెచ్‌ఇవో రవి, హెల్త్ సూపర్వైజర్ ఆనవాల, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.