బాన్సువాడ, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా మధ్యంతర భృతిని త్వరగా ప్రకటించి అనుకూలమైన పిఆర్సి అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనేకర్ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మండలంలో నిరసన తెలియజేసి తహాసిల్దార్‌కు నరసింహ చారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితో సమస్యల సాధన కోసం ఉద్యమమే అసలైన మార్గమని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉపాధ్యాయుల పెండిరగ్ బిల్లులను త్వరగా మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, కెజిబివి మోడల్‌స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు త్వరగా చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరసింహ చారి, దర్శనం శంకర్ జిల్లా బాధ్యులు జంగిలిరాజు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.