నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రాత్రి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, …
Read More »Daily Archives: July 26, 2023
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …
Read More »సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్రమవుతుండడంతో సీజనల్గా వచ్చుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ రకమైనటువంటి సమస్య ఉన్న ప్రజలందరూ ఐడిఓసి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్‌తోనే సాధ్యమైంది
బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ్ సాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న భారత మాజీ …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …
Read More »నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సేవలు భేష్
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. జనరల్ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి …
Read More »పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం స్థానిక నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో …
Read More »దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం
డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్ధిలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కీలకమని పేర్కొన్నారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి నూతన వినూతన ఆవిష్కరణలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. దానికి యువ …
Read More »జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్ బాబు
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారిగా మల్లికార్జున్ బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెంలో డి.ఎస్.ఓ.గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. సహాయ పౌర సరఫరాల అధికారిగా నిత్యానంద్ కూడా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన ఏ.ఎస్.ఓ. వెంకటేశ్వర్లు నిజామాబాద్‌కు బదిలీపై వెళ్లారు. ఇంతవరకు నల్గొండలో పనిచేసిన నిత్యానంద్ కామారెడ్డికి బదిలీపై …
Read More »ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. …
Read More »