సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్రమవుతుండడంతో సీజనల్గా వచ్చుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ రకమైనటువంటి సమస్య ఉన్న ప్రజలందరూ ఐడిఓసి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో సంప్రదించాలన్నారు.

దీని కొరకు 9390653962 అనే ఫోన్‌ నెంబర్‌ని సంప్రదించాలని ఈ సందర్భంగా తెలిపారు. వర్షాలు తీవ్రంగా కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనే ప్రజలంతా కూడా అప్రమత్తమై ఎటువంటి వ్యాధులకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదా మీ సమీపంలోనీ ఆరోగ్య ఉప కేంద్రాలు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం వివరించారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »