డిచ్‌పల్లి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంపై జాతీయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారతదేశ అభివృద్ధిలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కీలకమని పేర్కొన్నారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి నూతన వినూతన ఆవిష్కరణలు ప్రధాన భూమిక పోషిస్తాయని పేర్కొన్నారు. దానికి యువ విద్యార్థి మేధావులు ముందుకు వచ్చి పరిశోధనలు కొనసాగించాలని పేర్కొన్నారు.
విద్యార్థులకు ఆర్థికంగా సహకరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంటె లెక్చువల్ ప్రాపర్టీ అంశంపై తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టు సైంటిస్ట్ డా. రాధిక వంగాల ఇంటె లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్స్, కాఫీ రైట్స్ విద్యార్థులు ఎట్లా సాధించాలో వివరంగా తెలియజేశారు. కొత్త కొత్త ఆవిష్కరణలతో భారత దేశ విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని అంశం మీద సుదీర్ఘంగా సమగ్రంగా వివరించారు.
కార్యక్రమానికి అతిథిగా హాజరైన డా. శాంతా కుమారి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సమావేశాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ డైరెక్టర్ డా. వి.వాసం చంద్రశేఖర్ సమన్వయం చేశారు. ఫార్మాస్టికల్ కెమిస్ట్రీ విభాగ అధ్యాపకులు డా.శిరీష బోయపాటి, డా. మవురపు సత్యనారాయణ, డా. ప్రసన్న శీలా, అధ్యాపకులు డా.రామేశ్వరరెడ్డి, రమ్యశ్రీ, నరసయ్య, మరియు డా.అపర్ణ పాల్గొని పలు అంశాల పట్ల విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
అధిక సంఖ్యలో ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థులు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉపయోగాలతోపాటు నూతన ప్రాజెక్టుల ఆవశ్యకతను, ప్రాజెక్టులు పొందే మార్గాలను ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులను సాంక్షన్ చేసే సంస్థల వివరాలను తెలుసుకున్నారు.