బాన్సువాడ, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్స్‌వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్ రావ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, రాష్ట్ర గిరిజన విభాగం ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, టికెట్ ఎవరికి ఇచ్చిన గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని నాయకులు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో, వితంతులు, వికలాంగులకు 4000 వేల రూపాయలు పింఛను, నిరుద్యోగ భృతి 4000, మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, ఇల్లు ఇల్లు కట్టుకునే ప్రతి బీదవారికి ఐదు లక్షల రూపాయలు ఈ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నియోజకవర్గంలో పోచారం కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఇక్బాల్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు వహీద్, జిల్లా మాజీ కో ఆప్షన్ వలియోధిన్, డిసిసి డెలిగేట్ గంగా ప్రసాద్, రాష్త్ర యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ బానోత్ రమేష్,ఎత్తోండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తయ్యుబ్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోయుడి లక్ష్మన్,శివుడు, అబ్దుల్లా, యశ్వంత్, మారుతి, మునావర్, మైతాఫ్, వర్ని మండల కిసాన్ ఖేత్ అధ్యక్షులు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబు, సొసైటి డైరెక్టర్ గంగప్ప, అమృత్, గజ్జల సాయిలు, మోయున్, చంద దత్తు, హరి, రమేష్, దయానంద్, నసీం, సంజీవ్ రెడ్డి, హైమధ్, కీమ్యా, రామకృష్ణ, కృష్ణ, రమేష్, సిద్ధప్ప, సాయిబాబా, తస్లీమ్, పృథ్వీ, వినోద్ పాల్గొన్నారు.