రెంజల్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలను గురువారం వైస్ ఎంపీపీ క్యాతం యోగేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు కష్టపడి పండిరచిన పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఆయన వెంట రవి ,అనిల్,సాయి రమేష్ తదితరులు ఉన్నారు.