రెంజల్, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కందకుర్తి గోదారమ్మ జలకలను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువవ్వడంతో హరిద్ర, మంజీరా, గోదావరి నదుల త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల శివాలయం పూర్తిగా నీటమునిగింది.
ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచడం, విష్ణుపురి గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువ ప్రాంతమైన కందకుర్తి గోదావరికి చేరుతుంది. వీటికి తోడు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలతో త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం ఉరుకులు, పరుగులు తీస్తుంది. గోదావరి నది ఒడ్డున గల పురాతనపు శివాలయం నీట మునిగి పోయింది. గోదారమ్మ ఉరుకులు పరుగులతో జలకలను సంతరించుకున్న అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి సందర్శకుల తాకిడి ఎక్కువైంది.