నిజామాబాద్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్ సహాయకులు, స్వీపింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్ ల కోసం ఈ నెల 31 సాయంత్రం 5 గంటల వరకు ఈఎంఆర్ఎస్ ఇందల్వాయి పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
పదవ తరగతి పాసైన కొత్త నిజామాబాద్ జిల్లాలో బోనాఫైడ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు. గెజిటేడ్ అధికారి చేత దృవీకరించబడిన అర్హత పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సెక్యూరిటీ గార్డు పోస్ట్ లకు మాజీ సైనికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని వివరించారు. ఎంపిక ప్రక్రియ పూర్తి మెరిట్ ఆధారంగా చేస్తామని చెప్పారు.