ఆర్మూర్, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న శుక్రవారం కల్యాణలక్ష్మి, సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న మాట్లాడుతూ చేపూర్ గ్రామానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికంగా సి ఎమ్ ఆర్ ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేసినందుకు గ్రామస్తుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.