జిల్లా కలెక్టరేట్‌ దిగ్బంధం

నిజామాబాద్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ నిర్వహించారు. వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌ కార్యాలయం ముందు సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో కలెక్టరేట్‌ కు రాకపోకలు ఆగిపోయాయి.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌. దాసు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ… 25 రోజులుగా తమ న్యాయమైన ప్రజాస్వామ్యతమైన డిమాండ్ల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపాలని, సమ్మెను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

పంచాయతీ కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు చేయాలన్నారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని, పెండిరగ్‌ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌ బాబు, గంగాధర్‌, జంగం గంగాధర్‌, సాగర్‌, మినుకుమార్‌ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, బీ మల్లేష్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్‌.రమేష్‌, డి.కిషన్‌ రాష్ట్ర నాయకులు సత్యక్క, జిల్లా నాయకులు మురళి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌ బాబు జంగం గంగాధర్‌, మినుకుమార్‌, సాగర్‌ ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు ఖాజామొయినుద్దీన్‌, గంగాధర్‌, శివకుమార్‌, గంగాధర్‌, భారతి, పోశెట్టి తదితరులు మరియు వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »