నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఆరుట్ల రాజేశ్వర్ (ఎల్‌ఎంబి) పదవికాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎల్‌ఎంబి రాజేశ్వర్ సెక్రటేరియట్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీఎం కేసిఆర్ మీ మీద ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాలని అన్నారు.