కామారెడ్డి, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు.
సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండిరగ్ దరఖాస్తులను కూడా పరిశీలించి, అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 69 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఏవో రవీందర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సాయి భుజంగరావు, స్వప్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.