బాన్సువాడ, జూలై 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు రాం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్టీసీ కండక్టర్ నాగరాజు బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ చేయడానికి పని చిన్నదే అయినప్పటికీ హృదయం చాలా గొప్పదని ఆయన నాగరాజును అభినందించారు.
చంటి బిడ్డలకు పాలిచ్చేందుకు తల్లులు చాలా ఇబ్బంది పడతారని వారి పరిస్థితిని గమనించి గదిని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. పరిసరాలను ఆయన పరిశీలించి బస్టాండ్ పరిసరాల్లో నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. బస్టాండ్ లో ఉన్న దుకాణంలో పాప్కార్న్ ప్యాకెట్లను కొని బస్టాండ్‌లో ఉన్న చిన్నారులకు అందించారు.
అనంతరం డిపో మేనేజర్ సదాశివ్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ్, రామ్ ఫౌండేషన్ నాగరాజు, లక్ష్మణ్, సురేందర్, నాయకులు ఎజాస్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, వెంకటేష్, కిరణ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.