నిజామాబాద్, ఆగష్టు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ గోడ పత్రికను మంగళవారం నిజామాబాద్ నగరంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు.
మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న తిరుపతిలో జరిగే అఖిల భారత జాతీయ ఓబిసి 8వ మహాసభ ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను మంగళవారం నిజామాబాద్ జిల్లా బీసీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నుండి పెద్ద ఎత్తున బీసీలు మహాసభకు తరలి రావాలని జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.
మహాసభలో బీసీలకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగాలలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల బీసీల స్థితిగతులపైన చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 శాతం టికెట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.
బీసీలందరు రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు గాను ఐదు అసెంబ్లీ స్థానాలను బీసీల కేటాయించాలని అన్నారు. కార్యక్రమంలో పోల్కం గంగాకిషన్, ధర్శనం దేవేందర్, కరిపే రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, సంజీవ్, బాలన్న, తోట మహేష్, శంకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.