కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 3 న మధ్యాహ్నం 2 గంటలలోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిపై అభ్యంతరాలను తెలపాలని చెప్పారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులు చదివి వినిపించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్.డి.ఓ.లు, రమేష్ రాథోడ్, శ్రీనివాస్ రెడ్డి,వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.