కామరెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్‌లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్కీ డ్రా తీశారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సి, ఎస్టీ, బిసి త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు.
జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను 14 మద్యం దుకాణాల రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇందులో గౌడ కులానికి 15 శాతం అనగా 7, ఎస్సీలకు 10 శాతం 5, ఎస్టీ లకు 5 శాతం 2 మద్యం దుకాణాలు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. 70 శాతం అనగా 35 మద్యం దుకాణాలు జనరల్‌కు కేటాయించారు.
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ఇలా ఉన్నాయి. గౌడ కులస్తులకు 3,10,14,26,35,43,46 దుకాణాలు, ఎస్సిలకు 5,15,19,28,37దుకాణాలు, ఎస్టీ లకు 29,31దుకాణాలు కేటాయింపబడ్డాయి. కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ పర్యవేక్షకులు యస్.రవీంద్ర రాజు, ఎస్సి,ఎస్టీ,బిసి అధికారులు, ఆబ్కారీ శాఖ అధికారులు పాల్గొన్నారు.